బండ లాగుడు పోటీలు సంప్రదాయ క్రీడ
షాద్ నగర్, మార్చి 29: (విజయక్రాంతి) ఎడ్లతో బండ లాగుడు పోటీలు గ్రామీణ ప్రాంతంలో సంప్రదాయ క్రీడలలో ఒకటని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ హనుమాన్ రామలింగేశ్వర దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రైతు సంబరాలలో భాగంగా బండ లాగుడు పోటీలను పూజ కార్యక్రమంతో ఎమ్మెల్సి నవీన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఎడ్లతో బండలాగుడు పోటీలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా,రైతుల జీవన విధానం, వ్యవసాయ సంస్కృతి, సంప్రదాయలలో భాగమని అన్నారు.
కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, కొత్తపేట సర్పంచ్ హైమావతి జగదీశ్,పోమాల్ పల్లి సర్పంచ్ స్వప్న భూపాల్ రెడ్డి,ఇప్పలపల్లి సర్పంచ్ జంగయ్య,లేమామామిడి సర్పంచ్ సులోచన శ్రీనివాస్,మాజీ సర్పంచులు,కంలేకర్ నవీన్ కుమార్,తాండ్రా విష్ణువర్ధన్ రెడ్డి, శేఖర్ పంతులు,బాల్ రాజ్ గౌడ్,శ్రీశైలం,ఆంజనేయులు,ఉపసర్పంచ్ ప్రమోద్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ రామ్ రెడ్డి,మాజీ యంపిటిసి యాదయ్య,,వార్డు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.




