వయోజనుల విద్య అభివృద్ధే ఉల్లాస్ లక్ష్యం
ఉల్లాస్ కోఆర్డినేటర్ కరెప్ప
అయిజ మార్చి 29 : పలు కారణాల వల్ల చదువుకు దూరంగా ఉన్న వయసు పైబడిన వారిని (వయోజనులను) చదువుకు దగ్గర చేయడమే మా లక్ష్యంగా జిల్లాలోని పలు గ్రామాల అక్షర కేంద్రాల్లో చదువు చెప్పించడం జరుగుతుందని జిల్లా కోఆర్డినేటర్ కర్రెప్ప అన్నారు. ఆదివారం ఆయిజ మండలంలోని వివిధ గ్రామాల ఉల్లాస్ పరీక్ష కేంద్రాలను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం వేళలో వారి వారి పనులు చేసుకొని అక్షర కేంద్రాలకు వచ్చి చదువు నేర్చుకునే అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వారికి ఆదివారం రోజు పరీక్ష నిర్వహించినట్టు జిల్లా మొత్తంగా 490 పరీక్ష కేంద్రాలు ఐజ మండలంలో 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. జిల్లా మొత్తం 2143 మంది వయోజనులు పరీక్ష రాయాల్సి ఉందని వివరించారు. పరీక్ష సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుందని వారి వారి అనుకూలతలను బట్టి సౌలభ్యాన్ని బట్టి పరీక్ష కేంద్రానికి వచ్చి పరీక్ష రాసుకునే అవకాశం కల్పించిందని ఈ ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.




