8 August, 2026 | 1:16 AM

విశ్వనాథ్ అండ్ సన్స్ భావోద్వేగాల ప్రయాణం

08-08-2026 12:00 AM

తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. దర్శకుడు వెంకీ అట్లూరి తనదైన భావోద్వేగ కథనంతో రూపొందించిన ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇందులో మమితా బైజు హీరోయిన్ కాగా.. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలను పోషించారు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది.

భావోద్వేగభరితమైన, హృదయాన్ని తాకే కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ట్రైలర్‌లో సంజయ్ విశ్వనాథ్ అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రను పరిచయం చేశారు. నలభై ఏళ్ల వయస్సు దాటినా తన కలలను వదలకుండా ముం దుకు సాగే వ్యక్తిగా సూర్య కనిపించారు.

కథానాయిక మమితా బైజు తన అభినయంతో ఆకట్టుకోగా, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, ఇతర నటీనటులు ఈ కుటుంబ కథకు మరింత బలం చేకూర్చారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తుండగా, నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు.