17 May, 2026 | 1:19 AM

నీట్ లీక్‌పై 20న రౌండ్‌టేబుల్

17-05-2026 12:00 AM
  1. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం
  2. సమావేశానికి రావాలని కోరిన లెఫ్ట్ విద్యార్థి సంఘాల నేతలు

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో ఈ నెల 20వ తేదీన లెఫ్ట్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో కేటీఆర్‌కు లెఫ్ట్ విద్యార్థి సంఘాల ప్రతినిధులు శనివారం వినతిప త్రం అందజేశారు. బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ తుంగ బాలు సమన్వయంతో జరిగిన ఈ భేటీలో నీట్ పేపర్ లీకేజీ అంశం పై ప్రధానంగా చర్చించారు.

మోదీ హయాం లో వరుసగా అనేక పోటీ పరీక్షల పేపర్లు లీక్ అవుతున్నాయని, దీని వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దల మద్దతు ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వివరించారు. కార్యక్ర మంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు గ్యార నరేష్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కిరణ్, అశోక్‌రెడ్డి, పీడీఎస్‌యూ నాయకులు పొడిపొంగి నాగరాజు, పి.మహేష్, జీఆర్  పీడీఎస్‌యూ (విజృంభణ) నాయకులు పాల్గొన్నారు.