6 July, 2026 | 3:53 PM

Breaking News

ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •  

రౌడీషీటర్ మహ్మద్ అష్పాక్ అరెస్ట్

24-10-2024 01:42 AM

చార్మినార్, అక్టోబర్ 23: పలు కేసుల్లో నిందితుడిగా ఉండి తప్పించుకొని తిరుగుతున్న ఓ రౌడీషీటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అష్పాక్ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌గా నమోదై ఉన్నాడు. ఇతనిపై ఇప్పటికే 44 క్రిమినల్ కేసులు ఉండగా, వాటిలో 2 హత్య, 6 హత్యాయత్నం కేసులతో పాటు అత్యాచారం కేసులు కూడా ఉన్నాయి.

గత 25 ఏళ్లుగా అనేక నేరాలు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, కాలాపత్తర్ పోలీసులు సంయుక్తంగా అష్పాక్ ఆశ్రమం పొందిన ఇంటిపై బుధవారం దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు.