27 April, 2026 | 3:38 AM

ఆర్‌సీబీకి ఎదురుందా?

27-04-2026 01:43 AM

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్

సూపర్ ఫామ్‌లో కోహ్లీ, పడిక్కల్

ఢిల్లీ, ఏప్రిల్ 26 : ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛా లెంజర్స్ బెంగళూరు సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడబోతోంది. ఆర్సీబీ ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్‌లలో ఐదు విజయాలు సాధించి రెండింటిలో ఓడిపోయింది. ప్రస్తు తం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

బ్యాటింగ్‌లో ఫిల్ సాల్ట్ దూరమైనప్పటకీ విరాట్ కోహ్లీ, పడిక్కల్ తో పాటు పటిదార్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. చివర్లో టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా సైతం చెలరేగుతున్నారు. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, హ్యాజిల్ వుడ్ కీలకం కానున్నారు. రసిక్ సలామ్ దార్ గాయపడడంతో మంగే శ్ యాదవ్‌కు చోటు దక్కనుంది. స్పిన్ విభాగంలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ ఆర్సీబీకి ప్రధాన బలం. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండు ఓటములతో కాస్త డీలా పడింది.

గత మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్‌పై భారీ స్కోరు సాధించినా పరాజ యం తప్పలేదు. బ్యాటింగ్ లో కేఎల్ రాహు ల్, నితీశ్ రాణా ఫామ్‌లో ఉండగా.. నిస్సాం క నిరాశ పరుస్తున్నాడు. సమీర్ రిజ్వీ, డేవిడ్ మిల్లర్ కూడా చెలరేగితే తప్ప ఢిల్లీ ఓట ముల బాట వీడేట ట్టు కనిపించడం లేదు. బౌలింగ్‌లో మాత్రం ఢిల్లీ మరిం త మెరుగవ్వాల్సిం దే. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ పాయిం ట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాద వ్ అనుకున్న స్థాయిలో రాణించకపోవడం కూడా వారి ఓటములకు కారణమవుతోం ది. గత రికార్డులను చూస్తే ఇరు జట్లు 34 మ్యాచ్‌లలో తలపడితే 20 సార్లు ఆర్సీబీ, 13 సార్లు ఢిల్లీ గెలిచాయి. 

తుది జట్లు అంచనా

ఢిల్లీ క్యాపిటల్స్ : కెఎల్ రాహుల్(కీపర్), నిస్సాంక, నితీశ్ రాణా, స్టబ్స్, మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్), విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాద వ్, చమీరా, నటరాజన్, ముకేశ్ కుమార్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : కోహ్లీ, బెథెల్, పటిదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ , మంగేశ్ యాదవ్, సుయాశ్ శర్మ, హ్యాజిల్‌వుడ్