calender_icon.png 21 January, 2026 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్పీఎఫ్ పోలీసుల బ్రాస్ బ్యాండ్ ప్రదర్శన

20-01-2026 12:00:00 AM

  1. 21న బేగంపేట రైల్వే స్టేషన్

25న నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్

సికింద్రాబాద్, జనవరి 19 (విజయ క్రాంతి): రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని ప్రజల్లో దేశ భక్తిని పెంపొందిం చాలన్న సంకల్పంతో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్‌ఆధ్వర్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసు బృంధాలు రెండు రోజుల పాటు బ్రాస్ బ్యాండ్ ప్రదర్శనలు నిర్వహించనున్నాయి. ఈ మ్యూజిక్ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ బ్రాస్ బ్యాండ్ బృంధాలు పలు రకాల దేశ భక్తి గీతాలపై మ్యూజివ్ వాయిం చి ప్రజలకు  శ్రావ్యా నందాన్ని కలిగించనున్నారు.

ఈనెల 21న బేగంపేట్ రైల్వే స్టేషన్లో, 25న నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్లో మ్యూజిక్ వాయిద్య ప్రదర్శన చేయనునున్నారు. వందే మాతరం అనే ఇతివృత్తంతో బీటింగ్ రిట్రీట్ వేడుక 2026లో భాగంగా కొత్తగా ఈ మ్యూ జిక్ ప్రదర్శన నిర్వహిస్తున్నారు.బేగంపేట రైల్వే స్టేషన్ ఎదురుగా నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫారం 2 వద్ద ఈ ప్రదర్శన ఉం టుందని ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. ఈ రెండు ప్రదేశాలలో సాయంత్రం 6గంటల నంచి ఈ మ్యూజిక్ కార్యక్రమం ఉంటుందని, ప్రజలు  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.