20-01-2026 12:00:00 AM
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే
బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్, జనవరి19(విజయక్రాంతి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్ నుంచి విజయం సాధించి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు చట్టం ద్వారా చర్యలు తీసుకోవాల్సిన స్పీకర్ గడ్డం ప్రసాద్.. ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నిర్మల్‌లో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయమై తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు తెలిపారు. ఫిబ్రవరి 6 లోపు విచార ణ చేపట్టాలని, దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుపై కూడా వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు నోటీసులు జారీ చేసినట్టు వివరించారు. స్పీకర్ ప్రభుత్వానికి భయపడి నిర్ణయం తీసుకోపోకపోవడం రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్లే అని అన్నా రు. దీనిపై రాహుల్‌గాంధీ కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.