02-11-2025 01:04:06 AM
పరారీలో భారత సంతతికి చెందిన బ్లాక్‌రాక్ సీఈవో బ్రహ్మభట్
వాషింగ్టన్, నవంబర్ 1: అమెరికాలో బ్లాక్‌రాక్ అనే మల్టీనేషనల్ టెలికాం కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్న బంకిమ్ బ్రహ్మభట్ అనే భారత సంతతికి చెందిన వ్యక్తి 500 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 4,200 కోట్లు) భారీ రుణ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. కంపెనీ రుణాలు పొందేందుకు కృత్రిమంగా నకిలీ బిల్లులు సృష్టించి, లేని వినియోగదారులు ఉన్నట్లు ఖాతాలు సృష్టించి రుణం పొందారనే అభియోగాలు ఉన్నాయి.
జూలైలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రుణం పొందేందుకు సదరు కంపెనీలు సమర్పించిన ఈమెయిల్ అడ్రెస్‌లు నకిలీవని తేలింది. దీంతో సీఈవో బ్రహ్మభట్ పరారయ్యారు. న్యూయార్క్‌వ్యాప్తంగా ఉన్న ఆ కంపెనీ బ్రాంచీలు మూతపడ్డాయి.