13-11-2025 01:10:45 AM
ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ కార్యదర్శి టీ.కే శ్రీదేవి
హైదరాబాద్, నవంబర్ 12(విజయక్రాం తి): పురపాలక శాఖ పరిధిలో పలు పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం 17.94 కోట్లు విడుదల చేస్తూ బుధవారం పురపాలక శాఖ కార్యదర్శి టీ.కే.శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిధుల్లో అమృత్ 2.0 పథకం కింద 116 అర్బన్ లోకల్ బాడీల్లో ని 154 ప్రాజెక్టు పూర్తి చేసేందుకుగానూ రూ. 9.50 కోట్లు కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.‘అమృత్ మత్ర ఫర్ ట్రీస్’ కోసం ఈ నిధులను వినియోగించనున్నట్టు స్పష్టం చేశారు. సిటీ ఇన్వెస్ట్‌మెంట్ టూ ఇన్నోవేట్ ఇంటిగ్రేట్ అండ్ సస్టున్ కింద రూ. 6.45 కోట్లు కేటాయించారు. పెండింగ్ కింద రూ. 1.99 కోట్లు విడుదల చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.