15 April, 2026 | 1:40 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

మానుకోట, కేసముద్రం అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు

14-06-2025 12:00 AM

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే 

మహబూబాబాద్, జూన్ 13 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీ పట్టణ అభివృద్ధికి వంద కోట్లు, మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి 50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి 150 కోట్ల రూపాయలు కేటాయించారని ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ తెలిపారు.

150 కోట్లు అభివృద్ధి పనుల కోసం కేటాయించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. 150 కోట్ల రూపాయలతో మహబూబాబాద్, కేసముద్రం పట్టణాల్లో డ్రైనేజీ, రోడ్లు, పార్కులు, ఇతర మౌలిక వసతుల కోసం కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అలాగే మహబూబాబాద్ పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని సీఎం ను కోరగా సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.