గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్
14-06-2025 12:00 AM
శేరిలింగంపల్లి, జూన్ 13: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గచ్చిబౌలి లోని ఏఐజీ దావఖానకు శుక్రవారం వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు. డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్కు గ్యాస్ట్రిక్ పరీక్షలు చేశామని వైద్యులు తెలిపారు. సాధారణ పరీక్షల నిమిత్తమే ఆయన దావఖానకు వచ్చినట్లు వారు చెప్పారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ సంతోష్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు.
అయితే.. ఉన్నట్టుండి గులాబీ బాస్ కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకోవడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఆరోగ్య పరిస్థి తి విషయంలో గులాబీ శ్రేణులు కాస్త ఆందోళనకు లోనవుతున్నాయి. కాగా గతంలోనూ పలుమార్లు ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వచ్చారు.






