15 April, 2026 | 11:56 AM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

బడి పిల్లల్ని బడిలో చేర్పించండి

14-06-2025 12:00 AM

కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

స్టేషన్ ఘన్ పూర్, జూన్ 13 (విజయక్రాంతి): బడి ఈడు పిల్లల్ని బడిలో చేర్పించాలని  జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలో శుక్రవారం జరిగిన బడిబాట ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ, ప్రి ప్రైమరి పాఠశాలను సందర్శించారు.

ఈ విద్యా సంవత్సరం నుండి అంగన్వాడీ కేంద్రంలో కూడా స్కూల్ ప్రారంభంకు ముందు బడి గంట కొట్టాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ స్వయం గా బడి గంట కొట్టగా పిల్లలు లోనికి వెళ్లారు. అంగన్వాడీ కేంద్రంలో ఎగ్ బిర్యానీ నీ చిన్నారులకు, వారి తల్లులకు, గర్భిణీలకు కలెక్టర్ వడ్డించి తాను కూడా  వారితో కలిసి భోజనం చేసారు.

అనంతరం పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. అంగన్వాడి కేంద్రంలో పరిసరాలతో పాటు విద్యార్థులను ఆకర్షించే బొమ్మలను వేయించడం అభినందించారు. ప్రభుత్వం ద్వారా పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు అందించే వసతులను సక్రమంగా అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ డిఎస్ వెంకన్న, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ఫ్లోరెన్స్, తాసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎంఈఓ కొమరయ్య, పిహెచ్సి డాక్టర్ రూబీన, సంధ్యారాణి, సుజాత, కుమారస్వామి అంగన్వాడీ టీచర్లు, వివోలు పాల్గొన్నారు.