26-05-2025 12:24:13 AM
జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్..
మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్(District Additional Collector Sabavat Motilal) తెలిపారు. జిల్లాలో 345 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 320 కేంద్రాలు ద్వారా 21,253 మంది రైతుల వద్ద నుంచి 1,53,275 టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసి సంబంధిత రైతుల ఖాతాలలో 186.13 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు. రైతుల వద్ద నుంచి పూర్తి స్థాయిలో నిబంధనల ప్రకారం వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసిన 119 కొనుగోలు కేంద్రాలను మూసి వేయడం జరిగిందని తెలిపారు.
ప్రతి రోజు 358 లారీల ద్వారా 6 నుంచి 8 వేల టన్నుల ధాన్యం కరీంనగర్ లోని 68 మిల్లులకు, పెద్దపల్లిలోని 110 మిల్లులకు, జిల్లాలోని 20 మిల్లులకు తరలించడం జరుగుతుందని తెలిపారు. రైతు ఆటోమెటిక్ యంత్రంతో శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాల వద్దకు నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకురావాలని, అకాల వర్షాల సమయంలో కేంద్రాలలో అందుబాటులో ఉన్న టార్పాలిన్లను వినియోగించుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి అసౌక ర్యం కలుగకుండా కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్, గోనె సంచులు, టార్పాలిన్లు ఇతర అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, రైతులు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.