calender_icon.png 26 May, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఇప్టా 83వ ఆవిర్భావ వేడుకలు

26-05-2025 12:23:07 AM

ముషీరాబాద్, మే 25 (విజయ క్రాంతి) : అఖిల భారత ప్రజా నాట్య మండలి(ఇప్టా) 83వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో ఆదివారం హిమాయత్ నగర్ సత్యనారాయణ రెడ్డి భవన్ లో మాదాల రంగారావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ముఖ్య అతిధులుగా హాజరైన ఇప్టా జాతీయ ఉపాధ్యక్షులు కందిమల్ల ప్రతాప్ రెడ్డి జెండా ఎగురవేసి మాట్లాడారు. దేశంలో ఉన్నతమైన లక్షాలతో 1943 మే 25న అఖిల భారత ప్రజా నాట్య మండలి(ఇప్టా) ప్రారంభమైందని అన్నారు.

యుద్ధాలకు వ్యతిరేకంగా అటు స్వతంత్ర పోరాటంలో, తెలంగాణ సాయుధ రైతాంగ పోరులో కళారూపాలను తయారుచేసి జన చైతన్యంలోకి ఊతమిచ్చిన సంస్థ ప్రజానాట్య మండలి అని అన్నారు. దేశ భవిషత్తు కోసం స్వాతంత్య్ర పోరాటంలో సాంస్కృతిక ఉద్యమం సాగింది అన్నారు. నేడు కులం మతం పేరిట ప్రజలు కొట్టుకు చస్తున్నారని అన్నారు.

కుల రహిత సమ సమాజం కోసం ప్రజా కళాకారులు తమ కళలు సాహిత్యం ద్వారా చైత్యన్య వంతులు చేయవలసిన అవసరం ఉందన్నారు. ప్రముఖ విప్లవ నటులు దర్శకులు మాదాల రంగారావు జయంతి సందర్బంగా ఎర్రమల్లెలు, ఎర్ర సూర్యుడు, విప్లవ శంఖం సినిమాలోని పాటలు పాడుతూ నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కురిమిద్ద శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మి నారాయణ, సహాయ కార్యదర్శి కేతరాజు ఉప్పలయ్య, కార్యవర్గ సభ్యులు డి.వేణుగోపాల్ చారి, జనసేవాదళ్ నాయకులు మురళి క్రిష్ణ, ఏఐవైఎఫ్ హైదరాబాద్ నాయకులు కాంపల్లి కళ్యాణ్, పెరిమళ అనిల్ కుమార్, కళాకారులు రాము, శేఖర్, విజయ్ కుమార్, సరస్వతి భాస్కర్, మహేష్, పరుశురాం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.