calender_icon.png 26 May, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, కొత్త ఉత్తేజాన్ని అందిస్తాయి

26-05-2025 12:24:23 AM

ఐటీడీఏ పీఓ రాహుల్ 

భద్రాద్రి కొత్తగూడెం, మే 25 (విజయక్రాంతి): ప్రతిరోజు పనిచేసే కార్యాలయంలో, అధికారులు ఆకస్మిక పర్యటనలకు వెంట వెళ్లి విధి నిర్వహణలో బాధ్యతగ పనిచేసి, ఇంటి సభ్యుల పట్ల కూడా సమయం కేటాయించ లేక సతమతమవుతున్న ఉద్యోగులకు ఇలాంటి క్రీడలు నిర్వహించడం మనసుకు, ప్రశాంతత చేకూరి శరీరంకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తోందని ఐటీడీఏ ప్రాజెక్టు అధి కారి బి. రాహుల్ అన్నారు.

ఆదివారం కిన్నెరసాని లోని మోడల్ క్రీడా పాఠశాల మైదానములో ఐటీడీఏ భద్రాచలం అధికారులు , సిబ్బంది ఐటీడీవో ల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆట వీడుపుగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో ఆయన పాల్గొన్నారు. ఐటీడీఏ అధికారులు సిబ్బంది స్పోరట్స్ ఆఫీసర్ సమక్షంలో ఐటీడీఏ పీవో టాస్ వేసి క్రికెట్ పోటీలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయాలలో పనిచేసే అధికారులతో పాటు తన సిబ్బంది ప్రతిరోజు కార్యాలయాలకు వివిధ పనులపై వచ్చే ప్రముఖులకు, గిరిజన ప్రజలకు వారికి కావలసిన పనులు చేసి పెట్టి విధినిర్వణంలో అలసి సొలసి ఉన్న ఉద్యోగస్తులకు ఈ క్రీడలు మనసుకు ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. అంతేగాక శారీరకంగా మానసిక ఒత్తిడి నుండి దూరంగా చేయడానికి దోహద పడతాయన్నారు.

ఉద్యోగస్తులు శారీరక, మానసిక ఒత్తిడి నుండి బయటపడడానికి అప్పుడప్పుడు ఇలాంటి క్రీడలు నిర్వహించడం వల్ల మేధాశక్తి పెరిగి, విధినిర్వహణలో తమ వంతు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదం చేస్తాయన్నారు. ఏటీడీవోల జోన్లుగా నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంట్లో హోరా హోరీగా జరిగిన ఈ టోర్నమెంట్ లో భద్రాచలం ఏటీడీవో టీం పై భద్రాచలం ఐటీడీఏ పీవో క్రికెట్ టీం కప్పును సొంతం చేసుకుంది, టీం రన్నర్ గా ఏ టి డి ఓ భద్రాచలం టీం నిలిచింది.

ఈ క్రికెట్ టోర్నమెంట్ కు ఐటిడిఏ భద్రాచలం కార్యాలయం స్పోరట్స్ ఆఫీసర్ గోపాలరావు నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ కు అంపైర్లుగా రామారావు,వెంకటేశ్వర్లు వ్యవహరించారు.క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతలుగా, రన్నర్ గా నిలిచిన బృందం తో పాటు క్రికెట్ టోర్నమెంట్ లో పా ల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతి ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో దమ్మపేట ఏటీడీవో చంద్రమోహన్, స్పోరట్స్ అధికారి గోపాలరావు, ఏ ఎస్ ఓ వెంకట్ నారాయణ, నాగేశ్వరరావు, డిప్యూ టీ వార్డెన్ శంకర్, ఎం. బాలు, పి. వెంకటేశ్వర్లు, హరికృష్ణ, వార్డెన్ కబీర్, పాల్గొన్నారు.