15 April, 2026 | 9:04 AM

పెంచికలపేటలో మొరాయించిన ఆర్టీసీ బస్సు

29-10-2025 11:14 AM

ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు 

ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణీకుల ప్రయాణం 

మంథని,(విజయ క్రాంతి): పెద్దపెల్లి జిల్లా కమాన్ పూర్ మండలం లోని గోదావరిఖని-పెద్దపెల్లి ప్రధాన రహదారి  పెంచికలపేట పెట్రోల్ బంక్ వద్ద  ఆర్టీసీ బస్సు బుధవారం మొరాయించింది.  దీంతో బ‍స్స్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  ఇక చేసేదేమీ లేక ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణీకులు వెళ్లాల్సి వచ్చింది.