calender_icon.png 29 October, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాట్నపల్లి రైస్ మిల్లులో పేలిన బాయిలర్

29-10-2025 11:37:37 AM

 ఇద్దరికీ తీవ్ర గాయాలు.

సుల్తానాబాద్, (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి(Katnapally) శివారులోని రైస్ మిల్లులో ప్రమాదవశాత్తు బాయిలర్ పేలి భారీ నష్టం వాటిల్లింది. రామస్వామి, కుమారులకు ఇద్దరికి గాయాలు కాగా గమనించిన యజమాన్యం హుటాహుటిన వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరిలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.  రైస్ మిల్లు యాజమాన్యం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి కనకదుర్గ రైస్ మిల్లులో(Katnapally Kanakadurga Rice Mill) బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ  శబ్దం వినిపించింది. కళ్ళు మూసి తెరిచేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదవశాత్తు రైస్ మిల్లు బైలర్ పేలింది అని యజమాని తెలిపారు. ఈ ప్రమాదం లో  రెండు గోదాములతో పాటు మిషనర్స్, వరి ధాన్యం, బియ్యం తదితర దెబ్బతిని  నష్టం వాటిల్లిందన్నారు,  దాదాపుగా రెండు కోట్ల వరకు నష్టం వాటిలిందని యజమాని తిరుపతి రెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ పోలీసులు, రెవెన్యూ అధికారులు  సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు.