calender_icon.png 29 October, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుండపోత వర్షం అన్నదాతకు తీవ్ర నష్టం

29-10-2025 11:09:38 AM

దెబ్బతిన్న వరి పత్తి వేరుశనగ పంటలు.

చెరువులను తలపిస్తున్న వ్యవసాయ పొలాలు. 

కల్వకుర్తి: మొంథా తుఫాను రైతుల పాలిట శాపంగా మారింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం(Rain) కురవడంతో చేతికొచ్చిన పంటలు(Crop Damage ) పూర్తిగా దెబ్బతిన్నాయి. కోత దశలో ఉన్న వరి పంట నేలకొరిగింది. పత్తి తీయకపోవడంతో తడిసి ముద్ద అయిపోయింది. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి వేరుశనగ సాగు చేస్తే పొలాలు జాలువారి నీటిలోని పంట కొట్టుకపోయే దశకు చేరుకుంది. వాగులు వంకలు పారుతుండడంతో గ్రామీణ ప్రాంతాల జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. కల్వకుర్తి మండలం రఘుపతిపేట వద్ద  దుందుభి వాగు ప్రమాద కారంగా పారుతుంది. దీంతో కల్వకుర్తి తెలకపల్లి మార్గంలో రాక పోకలు నిలిచి పోయాయి. పంజుగుల వొద్ద సవుట వాగు ప్రమాద భరితంగా రహదారి పై నుంచి నీరు పారుతుంది. కల్వకుర్తి పట్టణంలో పలు కాలనీలో నీరు నిల్వ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పుర అధికారులు జేసీబీలతో నీళ్ల ముందుకు వెళ్లేలా పనులు చేస్తున్నారు.