15 April, 2026 | 8:04 AM

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

17-11-2025 01:06 AM

-ఇద్దరు ప్రయాణికులు మృతి

-జనగామ జిల్లా నిడిగొండలో ఘటన

జనగామ (రఘునాథ్‌పల్లి), నవంబర్ 16 (విజయక్రాంతి): తాండూరు బస్సు ప్రమా దం మర్చిపోకముందే మరో బస్సు ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతిచెం దారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండ లం నిడిగొండ గ్రామం సమీపంలో వరంగల్ జాతీయ రహదారిపై జరి గింది.

ఆదివారం తెల్లవారుజామున నిడిగొండ గ్రామం సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న ఇసుకలారీ (టీజీ07యుకె5469)ని వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీజీ03జెడ్0046) బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముంగుభాగం నుజ్జునుజ్జయి, ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

మృతుల్లో దుండిగల్‌కు చెందిన పులమాటి ఓం ప్రకాష్, హనుమకొండకు చెందిన నవదీప్ సింగ్ ఉన్నారు. క్షతగాత్రులను పోలీసులు జనగామ ఏరియా హాస్పి టల్‌కి తరలించారు. బస్సు డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.