calender_icon.png 17 November, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెట్‌పై కేంద్ర క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవాలి

17-11-2025 01:04:53 AM

-బీజేపీ రాష్ట్ర చీఫ్‌కు పీఆర్టీయూ నేతల వినతి

హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నుంచి మినహాయింపు ఇవ్వాలని పీఆర్టీయూ టీఎస్ సంఘం కోరింది. ఈనెల 18న కేంద్ర క్యాబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా కేంద్ర వివ్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మాట్లాడాలని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావును పీఆర్టీయూ టీఎస్ అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి, ప్రధానకార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్‌లు కోరారు. ఈమేరకు ఆదివారం రాంచందర్ రావును కలిసి వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రితో మాట్లాడి క్యాబినెట్ ఆమోదం తెలిపే విధంగా కృషి చేస్తానని రాంచందర్ రావు తెలిపినట్లు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.