22 April, 2026 | 7:13 AM

జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

29-11-2024 12:30 PM

పలువురు ప్రయాణికులకు గాయాలు 

ఆందోల్, (విజయక్రాంతి): 161వ జాతీయ రహదారిపై నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డివైడర్ కు ఢీకొడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. శుక్రవారం నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సు కాన్సన్పల్లి శివారులో డివైడర్లను ఢీకొంది. బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం జోగిపేట ఆసుపత్రికి తరలించారు ‌ . అతివేగంతో వస్తున్న బస్సు అదుపుతప్పి డివైడర్ కు ఢీకొడం జరిగిందని ప్రయాణికులు తెలిపారు.