21-07-2025 12:49:38 AM
బాన్సువాడ, జూలై 20 (విజయ క్రాంతి), అరుణాచలం వెళ్లే భక్తులకు ఈ నెల 27న మధ్యాహ్నము మూడు గంటలకు బాన్సువాడ డిపో నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆర్టిసి డిఎం ఆదివారము ఒక ప్రకటనలో తెలిపారు. అరుణాచలం గిరి ప్రదర్శన కొరకు ప్రయాణికులు కోరిక మీద బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈనెల 27న మధ్యాహ్నం మూడు గంటలకు బస్సు బాన్స్వాడ నుంచి బయలుదేరుతుంది అన్నారు.
బాన్సువాడ నుండి కాణిపాకం అరుణాచలం ప్రదర్శన అనంతరం గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకుని బాన్సువాడకు తిరుగు ప్రయాణం ఈనెల 30న రాత్రి 12 గంటలకు బాన్సువాడ చేరుకుంటుందని తెలిపారు. బస్సు సీట్ల రిజర్వేషన్ కొరకు గోపి కృష్ణ ఫోన్ నెంబర్ 906340 8477 ను సంప్రదించాలని డిఎం తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.