21-07-2025 12:48:27 AM
అర్మూర్, జులై 20 (విజయ క్రాంతి) : ఆగస్టు రెండో వారంలో అర్మూర్ లో జరిగే మాలల ఆత్మీయ సమావేశానికి రావాలని కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని ఆర్మూర్ డివిజన్ మాల మహానాడు నాయకులు ఆహ్వానించారు. శనివారం హైదరాబాద్ లోని సెక్రెటరీయేట్ లో కలిశారు. ఈ సంధర్భంగా సన్మానించారు.
ఆర్మూర్ పట్టణంలో యోగేశ్వర్ కాలనీలోని అంబేడ్కర్ అభ్యుదయ మాల సంఘం నిర్మాణం చేయుచున్న భవనాన్ని కుల్చేందుకు ఆర్మూర్ మున్సిపాలిటీ అధికారులు ప్రవర్తించిన తీరును మంత్రికి వివరించారు. స్పందించిన మంత్రి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించమని ఆదేశించినట్లు మాల ప్రతినిధులు తెలిపారు.
మంత్రి కలిసిన వారిలో ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి శెట్టిపల్లి నారాయణ, మాల మహానాడు ఆర్మూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మూగ ప్రభాకర్, డివిజన్ ట్రెజరర్ పులి గంగాధర్, డివిజన్ కన్వీనర్ చిటుమల నాగేష్ తదితరులు పాల్గొన్నారు.