21-07-2025 12:50:51 AM
-ఉత్తరాదికి మేలు చేసేలా నియోజకవర్గాల పునర్విభజన
- జనాభా నియంత్రణ పకడ్బందీగా పాటించినందుకు నష్టం
- జాతీయ భాషగా హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోం
- జైపూర్ టాక్ జర్నలిజం సదస్సులో కేటీఆర్
హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): నియోజకవర్గాల పునర్విభజ నలో దక్షిణాదికి అన్యాయం చేస్తే ఊరుకోబోమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ లాంటి ఒక్క రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారడం సమా ఖ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు.
నియోజకవర్గాల పునర్విభజనలో జరుగుతున్న అన్యాయంపై తెలంగాణలో కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్ కూడా ఒకే అభిప్రాయంతో ఉన్నాయన్నారు. అం దుకే ఇటీవల చెన్నైలో జరిగిన సమావేశంలో ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశామని కేటీఆర్ తెలిపారు.
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరుగుతున్న టాక్ జర్నలిజం 9వ ఎడిషన్ చర్చ కార్యక్రమంలో ఆదివారం కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.. జనాభా నియంత్రణ అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గ పునర్విభజనలో నష్టం జరుగకూడదన్నారు. మందబలం, అధికారం ఉంద న్న అహంకారంతో జాతీయ భాషగా హిందీని బలవంతంగా రుద్దుతామంటే చూస్తూ ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు.
ఓటుహక్కు కోల్పోవద్దు..
బీహార్‌లో జరుగుతున్న ఎన్నికల సర్వేపై స్పందించిన కేటీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో అర్హత కలిగిన ఏ ఒక్క వ్యక్తి కూడా తన ఓటు హక్కు ను కోల్పోకూడదని చెప్పారు. బీహార్‌లో జరుగుతున్న ఎన్నికల ఓటర్ల సవరణలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయని, దేశ ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని కేటీఆర్ ప్రశ్నించారు.
బీహార్‌లో జరుగుతున్న పరిణామాలపై తమ కు చాలా అభ్యంతరాలున్నాయని, దేశంలోని మిగతా రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుందని అన్నారు. ప్రజలను విడగొట్టే రాజకీయ కుట్రలకు అనుగుణంగా బీహార్ పరిణామాలు ఉ న్నాయన్న అనుమానం కలుగుతోందన్నారు.
ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, ఆందోళనలు చేయనంత మాత్రాన అంతా బాగుంద ని కాదని, రాజకీయ పార్టీలు, వ్యవస్థ మీద చాలా అసంతృప్తిగా ఉన్నారని, అందుకే నగరాల్లో ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉం టోందన్నారు. బీహార్‌లో ఐదు లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయని అంటున్నారని, ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని కేటీఆర్ చెప్పారు. గత ఎన్నికల్లో అక్కడ 12,500 ఓట్ల తేడాతోనే అక్కడ ఆర్జేడీ అధికారాన్ని కోల్పోయిందని కేటీఆర్ అన్నారు. ముందు దేశం, ఆ తర్వాతే ప్రాంతం, మతం, కులం అన్నారు.
జనాభా నియంత్రణ చేస్తే అన్యాయమా..
ప్రతి రాష్ట్రానికి ఉన్న జనసంఖ్య ఆధారంగా పార్లమెంట్‌లో ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం ఉండాలన్న లక్ష్యంతో గతంలో పునర్విభజన జరిగేదని కేటీఆర్ తెలిపారు. జనాభా పెరగడంతో 1971లో రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్ స్థానాలను 543 దగ్గర ఫ్రీజ్ చేశారని, 30 ఏళ్ల తర్వాత మళ్లీ పునర్విభజన చేస్తామన్నారని, ఈ లోపు ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయాలన్న ఆదేశాలు దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చాయన్నారు.
దీనికి అనుగుణంగా దక్షిణాదిన కుటుంబ నియంత్రణ పకడ్బందీగా అమలై 1948లో 26 శాతమున్న పాపులేషన్ 19 శాతానికి తగ్గిందని కేటీఆర్ తెలిపారు. ఉత్తరాదిన యూపీలాంటి రాష్ట్రాల్లో 1950 నుంచి ఇప్పటి వరకూ 239 శాతం పెరిగిందన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్‌ను అద్భుతంగా అమలు చేసిన కేరళ లాంటి దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు కేటాయిస్తామనడం అన్యాయమని కేటీఆర్ చెప్పారు.
ఫ్యామిలీ ప్లానింగ్ సరిగా అమలు చేయని యూపీలాంటి రాష్ట్రాలు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యాన్ని పెంచడం దక్షిణాదికి తగ్గిస్తామనడం సమాఖ్య స్ఫూర్తికి మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ముందుగా అందుబాటులో ఉండేది ఎమ్మెల్యేనే అని, అందుకే ఎమ్మెల్యే స్థానాలను పెంచాలన్నదే తమ పార్టీ అభిప్రాయమని, ఎంపీ సంఖ్య ఇప్పుడున్న ఎంపీ స్థానాలను అలాగే కొనసాగించాలన్నారు.
బీజేపీ మాటలు నమ్మేది లేదు..
ప్రధానిని ఉత్తర భారతదేశం నిర్ణయించా ల్సి వస్తే, రేపు ఆ ప్రభుత్వం ఆ ప్రాంతం ప్ర యోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని, కానీ దక్షిణ భారతదేశ అభిప్రా యాలను పరిగణలోకి తీసుకోదని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. పునర్విభజనపై కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్తున్న మాటల్ని తాము నమ్మడం లేదన్నారు.
ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్యే పెంచుతామని పెంచలేదని, కానీ, అస్సాం, జమ్ముకశ్మీర్‌లో రాజకీయ ప్రయోజనాల కో సం అసెంబ్లీ సీట్లను పెంచుకున్నారన్నారు. ఉత్తరాదిన యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అంటే ఇష్టమని కేటీఆర్ చెప్పారు.
దేశానికి ఒక జాతీయ భాష అవసరం లేదు..
దేశానికి ఒక జాతీయ భాష ఉండాల్సిన అవసరం లేదని, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశం అద్భుతంగా పురోగమిస్తోందని, ఇప్పుడు అవసరం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతి 250 కిలోమీటర్లకు మనదేశం లో భాషా, సంస్కృతి, ఆహారం, వేషభాషలు మారుతాయని, ఈ విషయంలో యూరప్‌కు ఇండియాకు చాలా దగ్గర పోలికలున్నాయన్నారు.
మన మధ్య ఎన్ని వైరుధ్యాలు ఉన్నా ఇంకా కలిసే ఉన్నామని, ప్రజలు మాట్లాడని భాషలు, కాలక్రమంలో కనుమరుగు అవుతాయన్నారు. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇంగ్లిష్‌ను మాట్లాడుతారని, ఇంగ్లిష్‌లోనే అపార అవకాశాలు దొరుకుతాయన్నారు. కేవలం హిందీ నేర్చుకొని అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలకు వెళ్లి ఏం చేయగలమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.