26 March, 2026 | 2:49 AM

గ్రామ గ్రామాన ఆర్టీసీ కనెక్టివిటీ!

26-03-2026 12:00 AM

మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంతోపాటు గ్రామ గ్రామాన ఆర్టీసీ కనెక్టివిటీని పెంచుతామని, మహాలక్ష్మీ పథకంతో పెరుగుతున్న రద్దీతో ఆర్టీసీని మరింత విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మూడు రోజుల సమీక్షా సమావేశంలో భాగంగా తొలి రోజు బుధవారం మంత్రి పొన్నం ప్ర భాకర్ నేతృత్వంలో అసెంబ్లీ కమిటీ హాల్ 1లో సమావేశాన్ని నిర్వహించారు.

తొలి రోజు ఉమ్మడి నల్లగొండ, మెదక్, రంగారెడి, హైదరాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధుల ని యోజకవర్గాల్లో ఉన్న సమస్యలను ఆర్టీసీ అధికారుల సమక్షంలో మంత్రి పొన్నం దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కోదాడ, హుజూర్ నగర్ బస్ స్టేషన్‌ల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆర్టీసీ అధికారులు సమస్యల పై నివేదిక రూపొందించనున్నారు. సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.