26 March, 2026 | 2:49 AM

స్పీకర్‌ను డిక్టేట్ చేయొద్దు

26-03-2026 12:00 AM

హరీశ్‌రావు అడిగినప్పుడల్లా మైక్ ఇవ్వడం కుదరదు

మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎలా నడపాలో స్పీకర్‌ను డిక్టేట్ చేయొద్దని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు. స్పీకర్‌ను డిక్టేట్ చేయాలని బీఆర్‌ఎస్ సభ్యు లు చూడటం మంచి పద్ధతి కాదని హితవుపలికారు. బీఆర్‌ఎస్ నాయకులు వారు అధి కార పక్షంలో ఉన్నప్పుడు బుల్డోజ్ చేశారని, ఇప్పుడూ అలాగే చేయాలనుకుంటే ఎ లా అ ని ప్రశ్నించారు.

బుధవారం శాసనసభలో మంత్రులు బిల్లులు పెట్టే సమయంలో అభ్యంతరాలు వ్యక్తంచేసిన బీఆర్‌ఎస్ స భ్యుల తీరుపై ఆయన ఘాటుగా స్పందించా రు. ఆ పార్టీ శాసనసభా నాయకుడిగా ఎన్నికయ్యేందుకు హరీశ్‌రావుకు అన్ని అర్హతలు ఉన్నా యన్నారు. ఆ పదవికి ఆయన సమర్ధుడని కితాబిచ్చారు. డిప్యూటీ లీడర్‌గా ఆయన కోరినప్పుడల్లా మైక్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. లెజిస్లేచర్ పార్టీ లీడర్ స్థానంలో కూర్చుంటే ఎప్పుడంటే అప్పుడు మాట్లాడటానికి అవకాశం ఉంటుందని హరీశ్‌రావు ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.