ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
24-04-2026 12:00 AM
- వెంటనే ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
- భద్రాచలం డిపోలో విధుల నిర్వహణ
- ఖమ్మం పట్టణంలో ఘటన
భద్రాచలం, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డిపోకి చెందిన ఆర్టీసీ డ్రైవర్ గూడూరు లింగారెడ్డి ఖమ్మం లో తన నివాసంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యా యత్నం చేసుకున్నారు.కుటుంబ సభ్యులు, స్థానికులు అతన్ని వెంటనే ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉంద ని తెలుస్తోంది.తన ఎడమ చేతిపై నా చావుకు నా భార్యనే కారణం అని రాసుకున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నప్పటికీ, కూతురు మాత్రం ఆర్టీసీ సమ్మెతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా పేర్కొంటున్నారు. సమ్మె సమయంలో ఈ ఘటనతో ఒక్కసారిగా ఆర్టీసీ కార్మికులు ఉలిక్కిపడ్డరూ. విషయం తెలుసుకొని ఆర్టీసీ కార్మికులు, అధికారులు ఆస్పత్రికి చేరుకున్నారు.






