శిథిలావస్థలో హౌసింగ్ కార్యాలయం
- మరో చోట పిల్లర్లు లేపి వదిలేసిన వైనం
- ఏండ్ల తరబడి నిరుపయోగంగా భవనం
- ప్రభుత్వం భవనమే కదా.. గిట్లనే ఉంటదేమో
జడ్చర్ల, ఏప్రిల్ 23 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లో గతంలో కీలకపాత్ర వహించిన హౌసింగ్ కార్యాలయం జడ్చర్లలో శిథిలావస్థ కు చేరింది. జడ్చర్ల పట్టణంలో మధ్యలో ఉన్న ఎంపీడీవో కార్యాలయంలో గతంలో ఏర్పాటుచేసిన హౌసింగ్ కార్యాలయం ఎవరు పట్టించుకోకపోవడంతో ఉపయోగానికి దూరంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది.
గతంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, పథకాల అమలు కోసం ఈ కార్యాలయాన్ని వినియోగించేవారు. ప్రస్తుతం గోడలు పగుళ్లు ఇచ్చి, పెచ్చులు ఊడిపోయి, కిటికీలు ధ్వంసమై దర్శనమిస్తోంది. భవనం ముందు భాగంలో అసంపూర్తిగా పిల్లర్లు అలాగే నిలిచిపోయాయి. చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి పాములు, తేళ్లకు ఆవాసంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ హౌసింగ్ కార్యాలయాన్ని వెంటనే పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లబ్ధిదారులకు సమాచారం, దరఖాస్తుల స్వీకరణకు ఈ కా ర్యాలయం అందుబాటులోకి తెస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. లేదం టే ఈ భవనాన్ని తొలగించి ప్రజా ప్ర యోజనాలకు వినియోగించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా హౌసింగ్ శాఖ ఉన్న తాధికారులు, స్థానిక అధికారులు స్పందించి ఈ భవనంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతుండ్రు.
- ఉపయోగిస్తే మేలు జరుగుతుంది..
నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల ని ర్మాణం వేగవంతంగా జరుగుతుంది. ప్రజ లు ఏ సంధ్యం వచ్చిన ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఉంది. ఎంపీడీవో కార్యాల యంతో పాటు ఇతర కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అక్కడ ఇక్కడ ఎక్క డో అంటూ తిరిగే పరిస్థితులు నెలకొన్నాయి.
ఉన్న కార్యాలయాన్ని వినియోగితంలోకి తీసుకువచ్చి ఇందిరమ్మ ఇం డ్ల నిర్మాణంలో ఎలాంటి స మస్యలు ఎదురైనా అక్కడ అధికారులు అందుబాటులో ఉంటే ప్రజలు సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు ఎంతో వెసులుబాటు ఉంటుంది. ఈ మేరకు చర్యలు తీసుకొని శిథిలావస్థలో ఉన్న భవనాన్ని వినియోగం లోకి తీసుకురావాలని ప్రజలు చెబుతున్న మాట.






