ప్రైవేటు దిశగా ఆర్టీసీ!
ప్రణాళికాబద్ధమైన కుట్ర?
ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాలు
- సొంతంగా ఈవీ బస్సులను కొనకుండా ప్రైవేటు కంపెనీల ద్వారా అద్దెకు
- అప్పుల్లో కూరుకుపోయేలా.. ఆపై డిపోలు, వర్క్‌షాప్‌లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు అమ్మకానికి!
- మహాలక్ష్మి బకాయిలకు అతీగతీ లేదు.. మొహం చాటేస్తున్న ప్రభుత్వం
* కార్మికలోకం మేల్కోవాలి..
దశాబ్దాల చరిత్ర ఉన్న ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలతోపాటు.. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులపై ఉంది. రాజకీయ నేతలు తమ వ్యవహారశైలిని మార్చుకోవాలి. ప్రజారవాణాకు సురక్షితమైన ఆర్టీసీని రక్షించేలా చర్యలు తీసుకోవాలి. కుట్రపూరితంగా ప్రైవేటీకరణకు తీసుకుం టున్న చర్యలను గర్హించాలి. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను అం దుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి.
ఉదాహరణకు.. కీలకమైన ఈవీ బస్సులను ఆర్టీసీయే సొంతంగా కొనుగోలు చేయడం ఇక్కడ ముఖ్యం. దీనివల్ల ఆర్టీసీలో మరింత ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆదా యం వస్తుంది. సంస్థ బలోపేతం అవుతుంది. అలాగే డీజిల్ బస్సులను ఈవీ బస్సులుగా చిన్నపాటి శిక్షణ ఇప్పించి.. ఆర్టీసీ వర్క్‌షాప్‌లలో కొత్తగా తయారుచేయవచ్చు.. ప్రభు త్వం మొత్తం బకాయిలు చెల్లించాలి..
ఇలాంటి చర్యలు తీసుకుంటే.. ఆర్టీసీపై కుట్ర ముక్కలైనట్టే. ఆ దిశగా ప్రభు త్వం చర్యలు తీసుకునేలా కార్మికలోకం, ప్రజలు, స్వచ్చంద సంస్థలు ఉద్యమించక తప్పదు. ఒత్తిడి తేవాల్సిందే. అప్పుడే ఆర్టీసీకి, తెలంగాణ ప్రజలకు ఉన్న అనుబంధం, భరోసా, నమ్మకం కలకాలం నిలిచిఉంటుంది.
హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి) : పచ్చగా ఉండే చెట్టు పడిపోవాల న్నా, ఎండిపోవాలన్నా, ఒక్కో కొమ్మను నరకడం.. తరువాత ఆ చెట్టుకు ప్రాణాధారంగా ఉన్న వేర్లను వేరు చేయడంతో ఎంతపెద్ద చెట్టునైనా పడేయవచ్చు. ఇది ప్రకృతి సూత్రం. ఇప్పుడు ఇదే సూత్రాన్ని తెలంగాణ ఆర్టీసీపై ప్రయోగిస్తున్నారు. ఆర్టీసీకి విభాగాలను ఒక్కొక్కటిగా బలహీనప రుస్తూ, చిట్టచివరికి అప్పుల్లో కూరుకుపోయేలా చేయడం.. ఆపై ఆర్టీసీని ప్రైవేటుప రం చేయాలనే దూరాలోచనతో రాష్ట్ర ప్ర భుత్వం ముందుకు కదులుతున్నట్టు ఆర్టీసీ కార్మికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
అప్పుల్లో కూరుకుపోయిన తర్వా త, వేల కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అమ్ముకునేలా చేసి.. ఆర్టీసీని గంపగుత్తగా ప్రైవేటు సంస్థగా మా ర్చాలనే కుట్రపూరితంగా ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తున్నదని ఆర్టీసీ కార్మికులు అం టున్నారు. దీని వెనుక.. రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు.. ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీని ప్రైవే టుపరం చేయడానికి తెరవెనుక జరిగే ప్రణాళికలు.. వాటి ప్రభావం ఎలా ఉం టుందో చూద్దాం..!
స్టేజ్-1 : బలాన్ని తగ్గించడం..
దశాబ్దాలుగా తెలంగాణవ్యాప్తంగా ప్రజలు నమ్ముకున్న రవాణా సాధనం.. ఆర్టీసీ బస్సు. ప్రజల నమ్మకాన్ని ఆర్టీసీ ఎళ్లవేళలా నిలు పుకుంటోంది. ఇందుకు ప్రధా న కారణం.. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల బలం. ఆర్టీసీ బస్సుల బలం. అయితే ఎలాగైనా ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలనే కుట్రపూరితంగా.. ఆర్టీసీలో కార్మికుల బలాన్ని, అలాగే బస్సుల బలగాన్ని కూడా తగ్గించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందనే ఆరోపణలకు ప్రస్తుత పరిస్థితులు అద్దంపడుతున్నాయి. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్టీసీలో మొత్తం ఉద్యోగులు, కార్మికుల సంఖ్య సుమారు 58 వేలు.
గడిచిన పుష్కర కాలం లో ఆర్టీసీలో తగ్గిన ఉద్యోగులు, కార్మికుల సంఖ్య 18 వేలు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న సిబ్బంది సంఖ్య దాదాపు 40 వేలు. గడిచిన పుష్కరకాలంలో ఒక్కసారికూడా సిబ్బంది రిక్రూట్‌మెంట్‌ను ప్రభుత్వం జరపలేదు. ప్రజారవాణాలో సేవ లు విస్తృతం అవుతున్నా.. సిబ్బందిని మాత్రం పెంచడంలేదు. తాజాగా కేవలం 3 వేల సిబ్బంది రిక్రూట్‌మెంట్‌కు ప్రభు త్వం పచ్చజెండా ఊపింది. పైగా కార్మిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా.. ఆర్టీసీ సమస్యలను లేవనెత్తే ఒక గొంతు వినపడకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుంద నే అపవాదు ఉంది. ఇక ఒకప్పుడు ఆర్టీసీలో సుమారు 10 వేల బస్సులు ఉండేవి.
ఇవన్నీ ఆర్టీసీ సంస్థవే. తరువాత మెల్లమెల్లగా హైర్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు పర్యావరణ హితం, కర్బన ఉద్గారాల తగ్గింపులో భాగంగా ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడుతున్నారు. అ యితే దీనికి ఎవరూ వ్యతిరేకం కాకున్నా.. ఎలక్ట్రికల్ బస్సులన్నింటినీ.. ప్రైవేటు కార్పొరేట్ సంస్థల నుంచి తెప్పిస్తున్నారు. ఒక్కో ఎలక్ట్రికల్ బస్సుకు కేంద్రం రూ.36 లక్షల గ్రాంట్‌ను ఇస్తోంది.
అయితే ఇలా ప్రైవేటు కార్పొరేట్ సం స్థలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్ వచ్చేలా చేయడంతోపాటు.. ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇస్తున్నారు. ఈ ఈవీ బస్సులను నిర్వహించడానికి డ్రైవర్టు, కండక్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, అధికారులను సదరు కార్పొరేట్ సంస్థలే ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించుకుంటున్నాయి. దీని తో ఈవీ బస్సులపై ఆర్టీసీ సిబ్బందికేకాదు.. సంస్థకుకూ డా అజమాయిషీ లేకుండా పోతోంది. పైగా ఆర్టీసీ డిపో ల్లో అద్దెకు ఇస్తున్న ఈవీ బస్సులను నిలపడానికి, ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణాన్ని ఆర్టీసీ రూ. కోట్లు ఖర్చుపెట్టి నిర్మిస్తోం ది. ఇలా ఆర్టీసీని రెండు విధాలుగా బలహీనం చేసేలా ప్రస్తుతం చర్యలు కొనసాగుతున్నాయి.
స్టేజ్-2 : నష్టాల్లోకి ఆర్టీసీ..
ఇప్పటికే ఈవీ బస్సు ఒక్కో కిలోమీటరు తిరిగితే రూ. 40.50 పైసలు జేబీఎం సంస్థకు, కిలోమీటరుకు రూ. 60 చొప్పున ఒలెక్ట్రా బస్సులకు ఆర్టీసీ అద్దెగా చెల్లిస్తోంది. ఇందులో కచ్చితంగా సదరు కార్పొరేట్ సంస్థకు లాభాల శాతం ఉంటుంది. అది సహజం కూడా. అదే బస్సులను ఆర్టీసీ సొంతంగా కొనుగోలు చేస్తే.. ఆ లాభాలన్నీ ఆర్టీసీకే వచ్చేవి. పైగా ఒక్కో ఈవీ బస్సును ఆర్టీసీయే కొనుగోలు చేస్తే.. కేంద్రం నుంచి రూ. 36 లక్షల చొప్పున గ్రాంట్ కూ డా ఆర్టీసీకి అందివచ్చేది. దీనితో ఆర్టీసీ అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉండేది.
కానీ కావాలనే ఆర్టీసీ సంస్థ ఈవీ బస్సులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. రాబోయే మూడేండ్లలో సిటీలోనే సుమారు 3,000 ఈవీ బస్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అటుపై వచ్చే ఐదారేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా మొ త్తం ఈవీ బస్సులే కనిపించనున్నాయి. ఇక ఇప్పుడు ఆర్టీసీలో ఉన్న డీజిల్ బస్సులను ఈవీ బస్సులుగా మార్చే టె క్నాలజీ ఉన్నప్పటికీ.. చిన్నపాటి శిక్షణతో ఆర్టీసీయే వాటిని మార్చుకునే అవకాశం ఉంది.
అయినా.. కొన్ని డీజిల్ బస్సులను ఈవీ బస్సులుగా మార్చే ఒప్పందాన్ని ప్రైవేటు సంస్థలతో చేసుకోవడం వెనుక.. ఆర్టీసీని మరింత బలహీనం చేసి.. అప్పుల్లోకి తీసుకెళ్ళడమే ప్రధాన ఉద్దేశంగా కార్మిక సంఘాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇటు డీజిల్ బస్సులతో ఎక్కువ ఖర్చును అంతిమంగా ప్రజలపైనే మోపాల్సి ఉంటుంది. అంతిమంగా ఆర్టీసీని వీలైనం త అప్పుల్లోకి నెట్టడమే ఉద్దేశంలా కనపడుతోంది. ప్రభుత్వానికి పేరు తెచ్చిపెడుతున్న మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నందుకు ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించడం లేదు.
ఇప్పటికే రూ.2,500 కోట్లు బకాయి ఉంది. దీనితో అంతిమం గా ఆర్థిక భారాన్ని ప్రజలపై (ప్రయాణీకులు) రుద్దాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల్లో ప్రజ ల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండటానికి ఛార్జీలు పెంచకుండా రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు అడ్డుకుంటారు. దీని తో తప్పకుండా ప్రత్యామ్నాయంగా ఆర్థిక వనరులను సేకరించేలా పరిస్థితులు సృష్టిస్తారని కార్మికులు ఆరోపిస్తున్నారు.
స్టేజ్-3 : ఆర్టీసీ ఆస్తుల లీజులు, అమ్మకాలు..
ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల విలువైన ఆస్తు లు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. కమర్షియల్ కాంప్లెక్స్‌లు, భూములు, వర్క్‌షాప్‌లు, డిపోలు, యంత్రాలు.. ఇలా ఎన్నో.. ఎంతో విలువైన ఆస్థులు ఆర్టీసీకి ఉన్నాయి. వీటి విలువ.. ప్రస్తుత బహిరంగ మార్కెట్లో వేల కోట్లు ఉంటాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఆర్టీసీ సంస్థ మరింత అప్పుల్లో కూరుకు పోతే.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీకి చెందిన పలు ఆస్థులను లీజుకు.. అవసరం అయితే అమ్మడానికి తెర లేస్తుందని కార్మికులు అంటున్నారు.
అంటే.. అప్పులు తీర్చడానికి ఆర్టీసీ ఆస్థులను లీజుకు ఇవ్వ డం, లేదా అమ్మేసే పరిస్థితులను సృష్టించి.. మెల్లమెల్లగా అన్యాక్రాంతం చేసే ప్రణాళిక నడుస్తుందని వారు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు.. ఆర్టీసీకి ప్రభు త్వం నుంచిగానీ.. బ్యాంకుల నుంచిగానీ (అప్పుల్లో కూరుకుపోవడంతో) ఎలాంటి రుణాలు ఇవ్వలేని పరిస్థితులను సృష్టిస్తారు. దీని తో ఆర్టీసీ ఆర్థికంగా పూర్తిగా బలహీనం అవుతుంది. బస్సులు తిప్పలేని పరిస్థితులు నెలకొంటాయి.
కేవలం ప్రైవేటు అద్దె బస్సులే దిక్కవుతాయి. డీజిల్ బస్సులన్నీ అరకొర తప్పితే.. మూలకు పడేయాల్సి వస్తుంది. దీనితో అవికూడా పనికిరాని విధంగా తయారవుతాయి. దీనితో సంస్థ ఆర్థిక పరిస్థితి మరింత కునారిల్లుతుంది. ఇక సంస్థ కుప్పకూలడం ఖాయం.. తామేం చేయలేమంటూ.. ప్రభు త్వం చేతులెత్తేస్తుంది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేటుపరం చేయడమే దీనికి సరైన పరిష్కారంలా ప్రచారంలోకి తీసుకొస్తారు. అంతిమంగా అందుకు రంగం సిద్ధం చేస్తారు.
స్టేజ్-4: ప్రైవేటు కార్పొరేట్ సంస్థకు అనుకూలం
అయితే ఇంతపెద్ద ప్రజారవాణా వ్యవస్థను సామాన్యులు, ప్రైవేటు కంపెనీలు నిర్వహించగలవా అంటే.. అందుకే మొదటి నుంచి ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆర్టీసీ కార్మికులు బలంగా చెబుతున్నారు. బస్సులను, ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లు, వర్క్‌షా ప్‌లను ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకే కట్టబెట్టేలా మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందిస్తారని వారంటున్నా రు.
ప్రజా రవాణాలో అనుభవం ఉండాలని.. వారి వద్ద తగినంత సిబ్బంది ఉండాలని.. కనీసం బస్సులను సొం తంగా కలిగి ఉండాలని.. ఇలా ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా నిబంధనలను రూపొందిస్తారు. ఇప్పటికే ఈవీ బస్సులను ఆర్టీసీ సొంతంగా కొనుగోలు చేయకుండా.. ప్రైవేటు కార్పొరేట్ సంస్థల ద్వారా తయారుచేయించి.. ఆర్టీసీకి అద్దెకు మాత్రమే ఇస్తున్నారు. అంటే.. ప్రజా రవాణాలో అనుభవం వస్తుందన్నమాట.
ఇప్పుడు వచ్చిన సు మారు 500 బస్సులు.. భవిష్యత్తులో వచ్చే వేలాది ఈవీ బస్సులన్నీ ప్రైవేటు సంస్థలవే. అంటే ఆయా కార్పొరేట్ సంస్థలకు సొంతంగా బస్సులు ఉన్నటే. తగినంత సిబ్బందికూడా ఉండాలనేది దృష్టిలో పెట్టుకుని.. ఇప్పుడు నడు పుతున్న, భవిష్యత్తులో నడిపించనున్న ఈవీ బస్సుల నిర్వహణకు కావాల్సిన సిబ్బందిని సదరు ప్రైవేటు కార్పొరేట్ సంస్థలే ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకుంటున్నాయి.
అంటే ఆ నిబంధన కూడా సంస్థలకు అనుకూ లంగా ఇప్పటినుంచి సిద్ధం చేసుకుంటున్నాయన్నమాట. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, రాజకీయ పార్టీల నేతలు.. తలోచేయి వేసి ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రజా రవాణా వ్యవస్థలను చేపట్టేలా నిబంధన లను రూపొందిస్తారు. దీనితో పని సులువవుతుంది. కావాల్సిన వారికే ప్రజారవాణా వ్యవస్థలను అతి చౌకగా అప్పగించే కార్యక్రమం పూర్తవుతుంది. దీనితో ఆర్టీసీ పూర్తిగా ప్రైవేటుపరం అవుతంది.
ప్రస్తుతం రెండో స్టేజ్ నడుస్తోందా?
ఇప్పటికే ఆర్టీసీలో ఉద్యోగులు, కార్మికులు ఏటియేడాది తగ్గిపోతున్నారు. విడతల వారీగా ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నారు. సొంతంగా ఈవీ బస్సులను కొనుగోలు చేసే అధికారాన్ని ఆర్టీసీకి ఇవ్వడం లేదు. డీజిల్ బస్సులను ఈవీ బస్సులుగా మార్చే అవకాశాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పుతున్నారు. ప్రైవేటు కార్పొరేట్ సంస్థల నుంచి ఈవీ బస్సులను అద్దెకు తెచ్చుకుంటున్నారు. కేంద్రం నుంచి వచ్చే రూ.36 లక్షల గ్రాంట్ నేరు గా ప్రైవేటు సంస్థల జేబుల్లోకి వెళుతోంది.
ఈవీ బస్సుల నిర్వహణకు సిబ్బందిని ప్రైవేటు కార్పొరేట్ సంస్థలే ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకుంటున్నాయి. ఈవీ బస్సుల ఛార్జింగ్‌కు, నిలిపేందుకు, సంరక్షణకు ఆర్టీసీ డిపోలను వాడుకుంటున్నాయి. ఇందుకు ఎలాంటి అద్దె చెల్లిం చడం లేదు. పైపెచ్చు ఛార్జింగ్ స్టేషన్లను ఆర్టీసీయే సొంతం గా కోట్లు ఖర్చుపెట్టి ఏర్పాటు చేయాలి. అప్పులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని చిన్నపాటిఆస్తులు, వర్క్ షాప్‌లు ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రావడం లేదు. మొత్తం అప్పులు రూ.13వేల కోట్లకు చేరుకున్నాయి. ఇవన్నీ లోతుగా గమనిస్తే.. పరిస్థితులను విశ్లేషిస్తే.. పైన చెప్పినట్టుగా ఒక్కో స్టేజ్‌ప్రకారం ఆర్టీసీని కుట్రపూరితంగా ప్రైవే టీకరణకు చర్యలు కొనసాగుతున్నట్టు అర్థమవుతుంది. ఆర్టీసీకార్మికులు, సిబ్బందికూడా ఇదే అంటున్నారు.. ప్రస్తుతం రెండో స్టేజ్‌లో ఆర్టీసీ ఉందని వారంటున్నారు.
స్టేజ్-5 : ఆర్టీసీ సిబ్బందికి రాంరాం..
బస్సులు లేకుండా, ఆస్తులు లేకుండా, అసలు సంస్థ నే లేకుండా.. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను కూర్చోబెట్టి ప్రభుత్వం జీతభత్యాలు ఇస్తుందా.. అంటే ఇవ్వదు. పోనీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తుందా అంటే.. అదీ లేదు. అపాయింటెండ్ డేకూడా ప్రకటించడానికి ఈ ప్ర భుత్వానికి రెండున్నర సంవత్సరాల సమయంకూడా సరిపోలేదంటే ప్రైవేటీకరణ ప్ర భావాన్ని అర్థం చేసుకోవాలని కార్మికులు బలంగా చెబుతున్నారు.
దీనితో ఆర్టీ సీ ఆస్తులన్నింటినీ.. ప్రవేటు కార్పొరేట్ సంస్థలకు చౌక గా అప్పగించి.. వచ్చిన నిధుల్లోంచి.. అప్పుడు ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు సెటిట్‌మెంట్ చేసి.. శాశ్వతంగా ఇంటికి పంపించివేస్తుంది. దీనితో ఆర్టీసీ ప్రై వేటీకరణ ప్రణాళిక సంపూర్ణంగా అమలైనట్టు అవు
తుందని కార్మి కులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ సంస్థను ప్రైవేటు కార్పొరేట్ సంస్థల చేతికి వచ్చిన తరువాత.. తెరవెనుక రాజకీయ పార్టీల నేతలకు ఎన్నికల ఖర్చుల నిమిత్తం భారీగా ముడుపులు ముడతాయనికూడా కార్మికులు ఆరోపిస్తున్నారు. రూ. వేల కోట్ల విలువైన భూములు, ఆస్తులు, వర్క్‌షాప్‌లను చాలా చౌకగా.. ప్రైవేటు కార్పొరేట్ సంస్థల చేతికి అప్పగించడంతోపాటు..
రాష్ట్రవ్యాప్తంగా ప్రజారవాణా వ్యవస్థను కూడా అప్పనంగా అప్పగించేలా కుట్రపూరితంగా ప్ర ణాళికను రచించి విజయవంతంగా అమలు చేసినందుకుగాను ఎన్నికలకు కావాల్సిన నిధులను ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు భారీగా ముడుపులు ముట్టజెప్పుతాయని వారు అనుమానిస్తున్నారు. తెరవెనుకు జరిగే ది ఇదేనంటూ తేల్చిచెబుతున్నారు.




