అవగాహనతో క్షయను అరికట్టవచ్చు
కిమ్స్ హాస్పిటల్స్ డాక్టర్ శుభకర్ నాదెళ్ల
హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): మార్చి 24న వరల్డ్ ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని క్షయవ్యాధిపై ముందస్తు గుర్తింపు, సరైన చికిత్స, పూర్తి స్థాయిలో మందుల వాడకం ఎంతో కీలకమని డా. శుభకర్ నాదెళ్ల (కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్) సూచిస్తున్నారు.
టిబి ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే అంటువ్యాధి. దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, రాత్రిళ్లు చెమటలు పడటం, బరువు తగ్గడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని చెపుతున్నారు. టిబి పూర్తిగా నయం అయ్యే వ్యాధేనని, అయితే మధ్యలో మందులు ఆపేస్తే సమస్య తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు.
ఛాతీ వైద్య కేంద్రాల్లో టిబి నిర్ధారణ, చికిత్స సేవలు అం దుబాటులో ఉన్నాయి. ప్రజలు అపోహలు విడిచిపెట్టి సమయానికి వైద్యులను సంప్రదించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. దగ్గు రెండు వారాలకు మిం చి ఉంటే పరీక్ష చేయించుకోవాలి. వైద్యుడు సూచించిన మందులను పూర్తి కోర్సుగా వాడాలి, టిబి రోగులతో సన్నిహితంగా ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకోవాలి. ఇంట్లో గాలి, వెలుతురు సరిగా వచ్చేలా చూడాలి. పోషకాహారం తీసుకోవాలి.




