29-06-2025 12:51:19 AM
కార్గో సేవల్లో పూర్తిగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించేందుకు అవకాశం!
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): ఆర్టీసీలో క్రమంగా రెగ్యులర్ ఉద్యోగుల సేవలను యాజమాన్యం తగ్గిస్తూ వస్తోంది. సం స్థకు ఎంతో పేరుతో పాటు ఆదాయాన్ని తీసుకువచ్చిన కార్గో సేవలకు ఇన్నాళ్లుగా ఆన్ డ్యూ టీలో విధులు నిర్వర్తించిన 142 మందిని ఆ సేవల నుంచి యాజమాన్యం మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కార్గో సేవల్లో 142 మం ది కండక్టర్లను తొలగిస్తున్నామని ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఇన్నాళ్లుగా ఆర్టీసీలో 3038 పోస్టుల రిక్రూట్‌మెంట్ చేస్తామని చెప్తూ వచ్చిన యాజమాన్యం... కనీసం ఒక్క పోస్టును భర్తీ చేయకపోయినా... ఔట్ సోర్సిం గ్ ద్వారా సిబ్బంది నియామకాన్ని ఉధృతం చేయడంపై ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీకి చక్కని లాభాలు అందిస్తు న్న కార్గో సేవల నుంచి ఉన్నపళంగా కండక్టర్లను తొలగించి ఔట్ సోర్సింగ్‌కు ఇవ్వడంపై కార్మిక సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కార్గో కోసం ఔట్ సోర్సింగ్ ద్వారా నియామాకాలు చేపట్టడం వల్ల డబ్బులు మిస్ యూజ్ అయ్యే ప్రమాదం ఉందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు.