25 April, 2026 | 3:21 AM

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మూడో రోజు

25-04-2026 01:47 AM

గద్వాల టౌన్ ఏప్రిల్ 24 తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మూడో రోజుకు చేరుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది.బస్సు సేవలు దాదాపు నిలిచిపోవడంతో ఉద్యోగులు,విద్యార్థులు,సాధారణ ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం సమయాల్లో బస్టాండ్ల వద్ద బస్సుల కోసం వేచి చూస్తున్న వారి సంఖ్య గ ణనీయంగా పెరిగింది.జేఏసీ పిలుపుతో కొనసాగుతున్న

ఈ సమ్మెలో భాగంగా గద్వాల డిపోలో మాత్రం కొంతమేర బస్సులు నడుస్తుండటంతో ప్రయాణికులకు స్వల్ప ఊరట లభిస్తోంది.అయినప్పటికీ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో రవాణా సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.ఇదే సమయంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీజీఎస్ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.సమ్మె తీవ్రత దృష్ట్యా గద్వాల ఆర్టీసీ డిపో వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.