24 April, 2026 | 3:49 PM

Breaking News

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

24-04-2026 02:39 PM

* ఐఎఫ్టీయూ డిమాండ్

గుండాల,(విజయక్రాంతి): గత మూడు రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వం జోక్యం చేసుకొని, చర్చలు నిర్వహించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని భారత కార్మిక సంఘాల సమైక్య(ఐఎఫ్టీయూ) రాష్ట్ర నాయకులు డి. ప్రసాద్, జిల్లా నాయకులు యాసారపు వెంకన్నలు శుక్రవారం డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెను విస్తరింపచేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అంతేకానీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని వారు విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు కోలా శంకర్ గౌడ్ కు ఐఎఫ్టీయూ గుండాల ఏరియా కమిటీ సంతాపాన్ని మరియు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం నాగేష్, వానపాకుల లాలయ్య, చంద్యా, తాటి కృష్ణ, మెంతిన నగేష్, కిరణ్, రవి తదితరులు పాల్గొన్నారు.