22 April, 2026 | 9:37 PM

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

22-04-2026 08:20 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతోపాటు తమ డిమాండ్లను అంగీకరించాలని  చెంగిచెర్ల డిపో జేఏసి కమిటీ  చైర్మన్  కే.బి.నర్సింహ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో బుధవారం సమ్మెకు దిగిన కార్మికులు చెంగిచెర్ల చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేసి ట్రెజరీ ద్వారా శాలరీలు అందజేస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ  అడిషనల్ చైర్మన్ సత్తయ్య,  కన్వీనర్ బి.రమేష్, కోశాధికారి సుల్తాన్పాషా,వైస్ చైర్మన్ రాజు రెడ్డి, మంజుల, తదితరులు పాల్గొన్నారు.