భూమిని కాపాడుదాం - భవిష్యత్తును రక్షిదాం
మధిర,(విజయక్రాంతి): ప్రపంచ ధాత్రి దినోత్సవం సందర్బంగా మధిర మండలంలోని కృష్ణాపురం గ్రామంలో గల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో అశ్రీత సంస్థ ఆధ్వర్యంలో భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ వారి సూచనలతో మన శక్తి మన భూమిపై జరిగిన అవగాహనా కార్యక్రమం ప్రిన్సిపాల్ రాములు నాయక్ అధ్యక్షతన బుధవారం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భరత్ విద్య సంస్థల చైర్మన్ శీలం వెంకటరెడ్డి మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ భూమిని రక్షించడం కొరకు ప్రజలకు అవగాహనా కల్పించడం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22 తారీఖున జరుపుకుంటామని కావున ప్రతిఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ చేయాలనీ పిలుపునిచ్చారు. సామాజిక సేవకులు లంకా కొండయ్య పాటలతో పర్యావరణం పై అవగాహనా కల్పించారు అనంతరం పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అశ్రీత సంస్థ అధ్యక్షులు శ్రీకాంత్, షేర్ సంస్థ డైరెక్టర్ గోపాలరెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాసరావు,పాఠశాల సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.






