Breaking News

ఇంచార్జీల చేతిలో కౌటాల పాలన

31-08-2026 | 01:10am
  1. కీలక శాఖల్లో రెగ్యులర్ అధికారులు కరువు
  2. అదనపు బాధ్యతలతోనే పాలన

కౌటాల, ఆగస్టు 30 (విజయక్రాంతి): మండల స్థాయి పాలనలో (In district level governance) కీలకమైన పలు శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో కౌటాల మండలానికి ఇంచార్జీల పా లనే దిక్కుగా మారింది. ఒకే అధికారి రెండు, మూడు మండలాల బాధ్యతలు నిర్వహిస్తుండటంతో ప్రజలకు అందాల్సిన సేవలు, స మస్యల పరిష్కారంపై ప్రభావం పడుతోంద నే విమర్శలు వినిపిస్తున్నాయి.

మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా కోట ప్రసాద్ సి ర్పూర్లో పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వహిస్తూ కౌటాలతో పాటు కాగజ్నగర్ బాధ్యతలను కూడా చూస్తున్నారు. దీంతో మూడు ప్రాం తాల పరిపాలనా బాధ్యతలు ఒకే అధికారిపై ఉండటం చర్చనీయాంశంగా మారింది.

ఏళ్లుగా విద్యాశాఖ అధికారి పోస్టు ఖాళీ

 మండలంలో మండల విద్యాశాఖ అధికారిగా సోమయ్య 19 ఏళ్లపాటు విధులు ని ర్వహించారు. ఆయన అనంతరం 2024 ఆగస్టు నుంచి ఈ పోస్టులో పూర్తిస్థాయి అధికారి లేకుండానే పాలన కొనసాగుతోంది. ప్ర స్తుతం ప్రధానోపాధ్యాయుడు గోడెం నానాజీకి ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. వి ద్యాశాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలు, పాఠశాలల పర్యవేక్షణలో పూర్తిస్థాయి అధికారి లేకపోవడం సమస్యగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విద్యుత్ శాఖలోనూ ఇంచార్జే....

విద్యుత్ శాఖలో కౌటాలకు పూర్తిస్థాయి ఏఈ లేకపోవడంతో బెజ్జూరు అసిస్టెంట్ ఇం జనీర్ అంజన్ కుమార్కు అదనపు బాధ్యత లు అప్పగించారు. మండలంలోని విద్యుత్ సమస్యలు, ప్రజల ఫిర్యాదులు, అత్యవసర పరిస్థితుల్లో స్థానికంగా అధికారి అందుబాటులో ఉండ టం ఎంతవరకు సాధ్యమనే ప్ర శ్నలు తలెత్తుతున్నాయి.

ఉపాధి హామీలో ఏపీవోగా టీఏ ఇంచార్జి బాధ్యతలు 

ఉపాధి హామీ పథకానికి కీలకమైన ఏపీవో అధికారి స్థానంలో (టి ఏ) సాంకేతిక సహాయకుడు అనిల్కు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ, కూలీల సమస్యలు, పనుల నిర్వహణ వంటి అంశాలపై దీని ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

వ్యవసాయ శాఖలోనూ పక్క మండలం అధికారే

మండల వ్యవసాయ అధికారి ప్రసూతి సెలవులో ఉండటంతో బెజ్జూరు వ్యవసాయ అధికారి నాగరాజ్కు కౌటాల అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో కౌటాల రైతుల కు సంబంధించిన వ్యవసాయ శాఖ సేవలను కూడా పక్క మండలం అధికారి పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పూర్తిస్థాయి అధికారుల నియామకం ఎప్పుడు?

మండలంలోని కీలక శాఖల్లో వరుసగా ఇంచార్జి వ్యవస్థ కొనసాగుతుండటంతో కౌ టాల మండలానికి పూర్తిస్థాయి అధికారులు ఎప్పుడు వస్తారు? అనే ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది. అదనపు బాధ్యతలతో పనిచేస్తున్న అధికారులు తమ పరిధిలోని అన్ని ప్రాంతాలకు సమయం కేటాయించడం ఎంతవరకు సాధ్యమన్నదీ చర్చనీయాంశంగా మారింది. ఇంచార్జీలతో తాత్కాలిక పాలన కాకుండా మండలంలోని కీలక శాఖలకు పూర్తిస్థాయి అధికారులను నియమించి ప్రజలకు సత్వర, మెరుగైన సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు