31 August, 2026 | 3:33 AM

దేశమే పులకించాలి

31-08-2026 01:30 AM
  1. గోదావరి పుష్కరాలంటే తెలంగాణే అనాలి
  2. ఈ సారి ఏర్పాట్లు దద్దరిల్లిపోవాలి
  3. సీఎం రేవంత్‌రెడ్డి రూ.1000 కోట్లు మంజూరు.. హర్షణీయం
  4. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ 
  5. పుష్కరాల నిర్వహణకు ప్రజాభవన్‌లో ప్రత్యేక ఆఫీస్
  6. కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ 

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాం తి): గోదావరి పుష్కరాలు అంటే తెలంగాణ, తెలంగాణ అంటే గోదావరి పుష్కరాలు అనే లా మార్మో గాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) అన్నారు. దేశమే పులకించిపోయేలా ఈ సారి ఏరాట్లు దద్దరి ల్లిపోవాలన్నారు. దే శం నలుమూలలా తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పే విధంగా గోదావరి పుష్కరాల ఏర్పాట్లు చేయాలన్నారు. గోదావరి పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.1000 కోట్ల నిధులను మంజూరు చేయడం హర్షణీయమని అన్నారు.

వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూ లై 7వ తేదీ వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను సమర్థ వంతంగా సమన్వయం చేసేందుకు ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్ ఆఫీసర్ (ప్రత్యేక అధికారి) కార్యాలయాన్ని మంత్రి కొండా సురే ఖ ఆదివారం ప్రారంభించారు. ఆ తర్వాత నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు ఘాట్ల నమూనా చిత్రాలను అధికారులతో కలిసి పరిశీ లించారు.

అనంతరం సురేఖ మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలు అనగానే ఇప్పటివరకు రాజమహేంద్రవరం పేరు ప్రధానంగా వినిపించే దని, వచ్చే గోదావరి పుష్కరాల నిర్వహణతో తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకోవాలని స్పష్టం చేశారు. పుష్కరాలు అంటే తెలంగాణ అనే స్థాయిలో మన రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

పుష్కరాలకు తరలివచ్చే భక్తు ల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మౌలిక వసతుల కల్పన, ఘాట్ల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యం, రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై ప్రత్యేక అధికారి కార్యాలయం కీలక సమన్వయ కేంద్రంగా పనిచేస్తోందన్నారు. దీంతో పాటు, పుష్కరాల నిర్వహణకు సంబంధించిన పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి వీలవుతుందని తెలిపారు.

భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు తెలంగాణ ఆతిథ్యం, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం ప్రతిబిం బించేలా వసతుల కల్పన వుండాలని మంత్రి సురేఖ అధికారులకు స్పష్టం చేశారు.  సరస్వతి నది ఆది, అంత్య పుష్కరాలను ఎంతో వైభవంగా నిర్వహించినట్లే, గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చాక సమ్మక్క-సారక్క జాతరను రెండుసార్లు విజయవంతంగా చేపట్టినట్లు గుర్తుచేశారు. 

ప్రారంభమైన ఘాట్ల నిర్మాణ పనులు

గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎంచుకున్న ప్రాంతాల్లో ఇప్పటికే ఘాట్ల నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు డైరక్టర్ హనుమంతరావు వివరించారు. టైర్-1, టైర్-2 పరిధిలో సుమారు 2 కి.మీ మేర ఘాట్ల నిర్మాణ పనులు ప్రారంభించగా, మొత్తంగా టైర్ 1, 2, 3 పరిధిలో 5 కి.మీకి పైగా ఘాట్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ శాఖలకు నిధులు విడుదలైనట్లు అధికారులు తెలిపారు.

అలాగే మెడికల్, పోలీస్, టూరిజం శాఖలకు నిధులు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. దశలవారీగా టెండర్ల నిర్వహణ, నిధుల మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గోదావరి నది పరీవాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా వున్నందున గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను కట్టుదిట్టం గా చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పాత ఘాట్లను పటిష్టం చేస్తూ, కొత్త ఘాట్లను మళ్లీ వచ్చే పుష్కరాల వరకు మనగలిగేలా పటిష్టంగా నిర్మించాలని అధికారు లకు, కాంట్రాక్టర్లకు సూచించారు. 

నాణ్యతకు ఆ ఇల్లే నిదర్శనం

నేపాల్‌లో వచ్చిన భారీ వరదల్లో చు ట్టుపక్కల ఎన్నో నిర్మాణాలు కొట్టుకుపోయినా, ఒక ఇల్లు మాత్రం చెక్కుచెదర కు ండా నిలిచిన తీరును మంత్రి సురేఖ ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాణ్యతకు గొప్ప ఉదాహరణగా ఆ ఇల్లు నిలుస్తుందన్నారు. గోదావరి పుష్కరాల పనులు విషయంలో హడావిడి లేకుండా నాణ్యతకు, పటిష్టతకు ప్రాధాన్యత ఇవ్వాలని కా ంట్రాక్టర్లకు, అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల కోసం చేపట్టే ప్రతి నిర్మాణాన్ని రాజీ పడకుండా నాణ్యతతో చేపట్టాలన్నారు.

ఆ నిర్మాణాలను తాత్కాలికమైనవిగా భావించ కుండా, భవిష్యత్ కార్యక్రమా లను ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. గ్రిల్స్‌ను పటిష్టం గా ఏర్పాటు చేయాలని, మహిళలు బట్ట లు మార్చు కునేందుకు అవసరమైన సౌ కర్యాలను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ డైరక్టర్ హనుమం తరావు, ఆర్జేసీ రామకృ ష్ణారావు, డీసీ కృష్ణ ప్రసాద్, పలువురు దేవాదాయ శాఖ అధికారులు, ఉద్యోగులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు, కాంట్రాక్ట ర్లు తదితరులు పాల్గొన్నారు.