పండుగలు ఐకమత్యానికి హేతువులు
జవహర్‌నగర్ మాజీ మేయర్ మేకల కావ్య
జవహర్‌నగర్, ఆగస్టు 30 (విజయక్రాం తి): ఎల్లమ్మ తల్లి దీవెనలు జవహర్ నగర్ ప్రజలందరిపై ఉండాలని, పండుగలు ఐక్యమత్యానికి హేతువులని జవహర్ నగర్ మా జీ మేయర్ మేకల కావ్య పేర్కొన్నారు. మ ల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పాపయ్య నగర్ లో శ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణం, బోనాల పండుగ వేడుకలు ఆదివారం ఘనంగా ని ర్వహించారు. ఈ కార్యక్రమానికి జవహర్ న గర్ మాజీ మేయర్ మేకల కావ్య హాజరై అ మ్మవార్లకు పూజలు
చేసి తీర్థ ప్రసాదాలు స్వీ కరించిన అనంతరం మాట్లాడుతూ, ఎల్లమ్మ తల్లి దీవెనలు జవహర్ నగర్ ప్రజలపై ఉండి అమ్మవారి కరుణాకటాక్షాలతో జవహర్ నగరే కాక తెలంగాణ యావత్తు పచ్చని పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ బోనాల పండగేనని ఈ పండుగ ఐక్యమత్యానికి చిహ్నాలు అన్నారు. అనంతరం రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవంలో పాల్గొని అమ్మవారి కరుణాకటాక్షానికి పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ యువ నాయకులు మేకల భార్గవ రామ్, పాపయ్య నగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






