30 July, 2026 | 4:48 PM

పిచ్చోడి చేతిలో రాయిలా పాలన

29-05-2024 01:03 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రముఖ కళాకారులు ఏలె లక్ష్మణ్ రూపొందించిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకు, సాంస్కృతిక వారసత్వానికి, గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటే ‘అది రాచరిక పోకడ’ అని అనడంపై మంగళవారం ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి ‘గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్’ అని పాడుకోవాలి. ‘కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప’ అని రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి.. అసలు ముఖ్యమంత్రికి, ఆయన మంత్రిమండలిలో ఒక్కరికైనా రాష్ట్ర గీతంలో ఏమున్నదో తెలుసా? అని నిలదీశారు.