12 July, 2026 | 4:12 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

నామినేషన్ స్వీకరణలో నిబంధనలు పాటించాలి

29-11-2025 12:21 AM

నూతనకల్, నవంబర్ 28:గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణలో అధికారులు నిబంధనలు పాటించాలని గ్రామపంచాయతీ ఎన్నికల పరిశీలకులు జి.రవి అన్నారు శుక్రవారం నూతనకల్ ఎర్రబాడు నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ స్వీకరణకు కేంద్రానికి అభ్యర్థి తో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతించాలన్నారు. నామినేషన్ ప్రక్రియ లో అభ్యర్థులకు సందేహాలు హెల్ప్ డెస్క్ సిబ్బంది నివృత్తి చేయాలన్నారు స్వీకరించిన నామినేషన్ పత్రాలను గ్రామాల వారిగా వేరువేరుగా భద్రపరచాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో సునీత,తహసిల్దార్ శ్రీనివాసరావు, రిటర్నింగ్ అధికారులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.