29-11-2025 12:22:34 AM
వలిగొండ, నవంబర్ 28 (విజయక్రాంతి): వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ కవి రెబ్బ మల్లికార్జున్ వలిగొండ శాఖా గ్రంథాలయానికి కథల పుస్తకాలు బహుకరించారు. కవి మల్లికార్జున్ ఇటీవల బాల సాహిత్యానికి సంబంధించిన “వినయశ్రీ” పేరుతో రాసిన బాలల కథల పుస్తకాలను గ్రంథాలయ ఇంచార్జ్ పిట్టల ఆంజనేయులుకు అందజేశారు. మల్లికార్జున్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులకు గ్రంథాలయాలు ఎంతో దోహదపడుతాయి. జ్ఞానాన్ని , విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించేవి గ్రంథాలయాలేనని అన్నారు.