ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ
మేడిపల్లి,ఏప్రిల్ 4 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో శనివారం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండగ పురస్కరించుకొని గత ఐదు సంవత్సరాలుగా ఛైర్మెన్ వసునూరి సన్నీ నాయకత్వంలో బేరాకా యూత్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీని ఈ సంవత్సరం శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా మాజీ మే యర్ తోటకుర అజయ్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, పాల్గొని క్రైస్తవ సమాజానికి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశా రు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ వసునూరి సన్నీ, వ్యవస్థాపద్యక్షులు ఆశీర్వాదం, పాస్టర్స్ వినోద, అమృతరాజ్, ప్రభాకర్, మనోహర్, కృష్ణ, భేరాకా కమిటీ సభ్యులు అగస్టిన్, మ హేష్, ప్రేమ, అరుణ్, మనోహర్, సాత్విక్, ప్రకాష్, క్రాంతి, సాయి, కృప రాణి, సుస్మిత, నిస్సి, హర్షిత, క్రైస్తవలు పాల్గొన్నారు.




