17 June, 2026 | 4:34 PM

Breaking News

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు   •   అంతర్రాష్ట్ర బస్సు సర్వీస్ ప్రారంభం   •   తంగళ్లపల్లిలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు.. యూరియా యాప్ అమ్మకాలపై అవగాహన   •   కలెక్టర్.. టీచర్ అయ్యారు   •   ఆదివాసుల మధ్య చిచ్చు పెడుతున్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   వదలపర్తి గ్రామంలో మురికి కాలువలో పూడికతీత   •   అనారోగ్యంతో మరణించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కును అందజేత   •   శ్రీ కోదండ రామాలయంలో పునర్వసు నక్షత్ర పూజలు   •   మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి   •   జిల్లా కేంద్రంలో కోతుల బెడద.. భయాందోళనలో ప్రజలు   •  

సుల్తానాబాద్‌లో గంజాయి మొక్కల కలకలం

05-04-2026 12:09 AM

స్వాధీనం చేసుకున్న పోలీసులు 

సుల్తానాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల శివారులో ఉన్న సాయిరాం బ్రిక్స్‌లో శనివారం గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఈ సంఘటన సుల్తానాబాద్ లో కలకలం రేపింది, ఎస్‌ఐ చంద్రకుమార్ తెలిపిన వివరాల మేరకు బ్రిక్స్‌లో పని చేస్తున్న ఒరిస్సాకు చెందిన కార్మికుడు మొక్కలు పెంచుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

ఈ మేరకు మొక్కలు పెంచుతున్న స్థలానికి చేరుకుని మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. దాదాపు వీటి విలువ 50 వేల రూపాయల వరకు ఉంటుందని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రకుమార్ తెలిపారు.