5 April, 2026 | 4:08 AM

26న గద్దర్ యాది సభ

05-04-2026 12:11 AM

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): ప్రజా యుద్ధ నౌక గద్దర్‌పై కాల్పులు జరిగి 29 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 26న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ప్రశ్నించే గొంతులు -సాధించిన విజయాలు’ పేరుతో సభను గద్దర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నదని, ఈ సభకు సబ్బండ కులాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని బీసీ జెఎసి చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చా రు.

హైదరాబాదులోని బీసీ జేఏసీ రాష్ట్ర కార్యా లయంలో శనివారం గద్దర్ ఫౌండేషన్ చైర్మన్ జీవి సూర్య కిరణ్‌తో కలిసి సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లా డుతూ.. 6 ఏప్రిల్ 1997న పాలకులకు ధిక్కారస్వరంగా, ప్రశ్నిం చే గొంతుకగా ఉన్న ప్రజా యుద్ధనౌక గద్దర్‌పై నాటి ఆంధ్ర పాలనలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారని ఆరోపించారు.

కాల్పు లు జరిపి ఈ నెల 26 నాటికి 29 సం వత్సరాలు నిండుతాయని, 29 సంవత్స రాలు అవుతున్నప్పటికీ దోషులను అరెస్టు చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని ఆయన ఆరోపించారు. గద్దర్ ను గుర్తు చేసుకుంటూ 26 తేదీన గద్దర్ కుమారుడు, ఫౌండేషన్ చైర్మన్ జీవి సూర్య కిరణ్ నిర్వహించే సభకు వేలాదిగా తరలివ చ్చి విజయవంతం చేయాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సమావేశంలో గద్దర్ ఫౌండేషన్ కార్యదర్శి సరిత, బీసీ నేతలు గజ్జ కృష్ణా, కుల్కచర్ల శ్రీనివాస్, జాజుల లింగంగౌడ్, నంద గోపాల్, గజ్జెల సత్యరాజు గౌడ్, తిరుపతయ్య, కే వెంకటేష్ గౌడ్, సి వి రావు తదితరులు పాల్గొన్నారు.