17 August, 2026 | 4:59 AM

కొత్తగూడెంలో ఉపాధ్యాయులతో 2కే రన్

17-08-2026 12:21 AM
  1. సీపీఎస్ రద్దు చేయాలి  
  2. 6 డీఏలు, పీఆర్సీ ప్రకటించాలి  
  3. పిఆర్‌టి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  వెంకటేశ్వరావు  

కొత్తగూడెం, ఆగస్టు 16, (విజయక్రాంతి):రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఆర్డీఏలను మంజూరు చేయాలని, పి అర్ సి ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పిఆర్టియు ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి.వెంకటేశ్వరరావు (డి వి) ర్యాలీని ప్రారంభించారు. ఉపాధ్యాయుల ర్యాలీకి స్థానిక ఎమ్మెల్యే సాంబశివరావు మద్దతు ప్రకటించారు.

ర్యాలీలో సిపిఎస్ రద్దు చేయాలని, ఆర్ డి ఏ లు పిఆర్సి ప్రకటించాలని, పెండింగ్ బిల్లులు, పెన్షనర్స్ బకాయిలు చెల్లించాలని  ఒక చేతితో ప్లే కార్డులు మరో చేతిలో జెండాలు చేతబట్టి పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి బస్టాండ్ మీదుగా రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో గల డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్నీ సమర్పించారు . కార్యక్రమంలో పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి రవి సంగమేశ్వర రావులు,జూలూరుపాడు ఎంఐఓ జుమ్కిలాల్ , కొత్తగూడెం ఎంఈఓ నీర్జా , బాలాజీ , పెద్ద సంఘలో ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.