ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
17-08-2026 12:21 AM
జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్
కామారెడ్డి, ఆగస్టు 16,(విజయ క్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ యువతకు ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కే. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. కామారెడ్డిలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను గుర్తించి నియామక క్యా లెండర్ ప్రకటించాలని కోరారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం కేవలం 16 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని విమర్శించారు.






