18 March, 2026 | 12:06 PM

Breaking News

మూసీ ప్రాజెక్ట్ మొదటి దశ డీపీఆర్ తయారైంది: మంత్రి శ్రీధర్ బాబు   •   మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •  

ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపాయి విలువ

07-11-2024 12:00 AM

ఒక్క రోజులో 22 పైసలు పతనం

ముంబై, నవంబర్ 6: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన నేపథ్యంలో యూఎస్ డాలర్ భారీ ర్యాలీ జరపడంతో భారత్‌తో సహా వర్థమాన దేశాల కరెన్సీ లన్నీ పతనమయ్యాయి. బుధవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో (ఫారెక్స్)డాలరు మారకంలో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయికి పడిపోయింది.

ఈ ఒక్కరోజులోనే 22 పైసలు క్షీణించి 84.31 వద్ద నిలిచింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా నిధులు తరలించడం కూడా రూపాయిపై ప్రభావం చూపిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.