11 August, 2026 | 12:51 PM

Breaking News

అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •   కొలంబియాలో భారీ భూకంపం   •   శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా వెండి కాయిన్స్ స్వాధీనం   •  

రికార్డు కనిష్ఠానికి రూపాయి

19-07-2024 12:05 AM

ముంబై, జూలై  18: ప్రపంచ మార్కెట్లో డాలరు బలం పుంజుకోవడం, క్రూడాయిల్ ధరలు పెరగ డంతో డాలరు మారకంలో రూపాయి విలువ రికార్డు కనిష్ఠస్థాయికి పడిపోయింది.. గురువారం ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో ఇంట్రాడేలో  పైసలు క్షీణించి 83.66 వద్ద కనిష్ఠస్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 6 పైసలు కోల్పోయి 83.64 వద్ద ముగిసింది. ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రధమం. గత నెల మూడోవారంలో ముగింపు 83.61 స్థాయి నుంచి కరెన్సీ మరింత తగ్గింది. పటిష్ఠమైన యూఎస్ డాలర్‌కు తోడు ఆసియా, యూరప్ కరెన్సీలు బలహీనపడినందున, సమీప భవిష్యత్తులో రూపాయి దిగువస్థాయిలోనే ఉంటు ందని అంచనా వేస్తున్నట్టు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.