2 July, 2026 | 6:14 PM

విద్యార్థులకు ఏమవుతోంది?

11-05-2024 12:05 AM

అమెరికాలో ఉన్నత విద్య చదువుకునేందుకు వెళుతున్న మన విద్యార్థులకు ఏమవుతున్నదో తెలియడం లేదు. హనుమకొండకు చెందిన విద్యార్థి రూపేశ్ తాజాగా గత వారం రోజులుగా కనిపించడం లేదని వార్తలు వచ్చాయి. విస్కాస్కిన్ కాంకార్డియా విశ్వవి ద్యాలయంలో మాస్టర్స్ చేస్తున్నాడుట. ఈనెల 2న చికాగో వెళ్లి అప్పట్నించీ కనిపించకపోవడంతో అతడి స్నేహితులు అక్కడి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారుట. ఏప్రిల్‌లోనూ హైదరా బాద్‌కు చెందిన అబ్దుల్ అర్ఫత్ అనే యువకుడూ ఇలాగే అదృశ్య మై కొన్నాళ్లకు కీవ్‌ల్యాండ్‌లో శవమై కనిపించాడు. ఫిబ్రవరి, జన వరి నెలల్లోనూ ఇలాంటి సంఘటనలు జరిగినట్టు తెలుస్తున్నది. 

 ఆర్.కృష్ణ కుమార్, వరంగల్